Tumgik
#Dalitha Bandhu
tjnews · 1 year
Text
Last 5 days to apply KCR's One Lakh BC Bandhu for every Household in Telangana!
The Mouthpiece of a Telangana
తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న రూ.లక్ష ఆర్థిక సాయం అర్హతా నిబంధనలు తెలంగాణలో వెనుకబడిన వర్గాల్లోని కులవృత్తులు, చేతివృత్తిదారులకు రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న రూ.లక్ష ఆర్థిక సాయానికి సంబంధించిన ప్రక్రియ షురూ అయింది. దీనికి సంబంధించిన విధివిధానాలను రూపొందిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించడానికి వీలుగా అధికారులు ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించారు. గత…
Tumblr media
View On WordPress
0 notes
yuvataram · 2 years
Text
దళితుల బాగు కోసమే రాజ్యాంగం మార్పు కోరితే.. దళితున్ని ముఖ్యమంత్రి చెయ్యాలి..
దళితుల బాగు కోసమే రాజ్యాంగం మార్పు కోరితే.. దళితున్ని ముఖ్యమంత్రి చెయ్యాలి..
రాజ్యాంగ మార్పు పై కెసిఆర్ తన వ్యాఖ్యలను సమర్ధించుకునే ముందు దళితులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ,ముందు కెసిఆర్ తన పదవికి రాజీనామా చేసి దళితున్ని ముఖ్యమంత్రిని చేయాలని, దళితులకు 3 ఎకరాల భూమి హామీ వెంటనే అమలు చేసి తన చిత్తశుద్ధిని నిరూపించు కుంటే మంచిదని, లేకుంటే అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానించిన కెసిఆర్ ను తెలంగాణ నుండి తరిమికొట్టడానికి బడుగు బలహీన వర్గాల ప్రజానీకం సిద్ధం కావాలని మాజీ…
Tumblr media
View On WordPress
0 notes
telanganajournalist · 2 years
Text
In Telangana State Ruling Party's Dalitha Bandhu Scheme, Opposition Party's Praja Sangrama Yatra, Congress Party's Rachabanda.. Are they bring Social Justice & Equality to Bahujans?
Tumblr media
డా. బీ. ఆర్ అంబేడ్క‌ర్ 131వ జయంతి సంద‌ర్భంగా తెలంగాణ‌లో నేడు తొలి విడుత‌ ద‌ళిత‌బంధు ల‌బ్దిదారుల సంబ‌రాలు!: ఇక్క‌డితోనే బ‌హుజ‌నుల పోరాలు ఆగిపోతాయ‌నుకోవ‌డం వాళ్ళ భ్ర‌మ‌!
Tumblr media
తెలంగాణ రాష్ట్రంలో తొలి విడ‌త‌లో 23, 204 మంది ల‌బ్దిదారుల‌కు ద‌ళిత‌బంధు నిధులను ఒక్కొక్క‌రికి 10 ల‌క్ష‌ల చొప్పున‌ వారు కోరుకున్న ఉపాధి పొందే విధంగా ట్రాక్ట‌ర్ల‌ను, బొలెరో ట్రాన్స్ పోర్ట్ వాహ‌నాల‌ను అందించిన విష‌యం తెలిసిందే. డా. బీ. ఆర్ అంబేడ్క‌ర్ ఆశ‌యాల‌కు అనుగుణంగా కేసీఆర్ ప్ర‌భుత్వం న‌డుచుకుంటోంద‌ని అధికార పార్టీ నేత‌లు చెబుతున్నా...ఆ దిశ‌గా అడుగులు వేస్తున్నారని కొంద‌రు బ‌హుజ‌న‌ మేధావులు అనుకోవ‌డం లేదు. కేవ‌లం ద‌ళిత బంధుకోసమే ఈ ఆర్థిక సంవ‌త్స‌రం సుమారు 17700 కోట్లు నిధులు విడుద‌ల చేయడం జ‌రిగింద‌ని ఎస్సీ కార్పోరేష‌న్ చైర్మ‌న్ బీ శ్రీనివాస్ ప‌త్రికా ముఖంగా తెలియ‌జేశారు. ప్ర‌తి నియోజ‌క వ‌ర్గానికి 100 మంది చొప్పున నిరుపేద‌ ద‌ళిత కుటుంబాల ఎంపిక నిస్ప‌క్ష‌పాతంగా జ‌రిగింద‌ని ప్ర‌భుత్వం చెబుతున్నా.. ప‌లువురు పార్టీ అనుబంధంగా ప‌నిచేస్తున్న వాళ్ల‌కు, ఒక నియోజ‌క‌వ‌ర్గంలో స్య‌యానా ఒక ఎమ్మెల్యే త‌మ్ముడికి ద‌ళిత‌బంధు ల‌బ్దిదారుడిగా ఉన్నాడ‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఏది ఏమైనా ఇవాళ 15 శాతం దళితులు( ఎస్సీలు), 50 శాతం వెన‌క‌బ‌డిన వ‌ర్గాలు( బీసీలు), 10 శాతం (ఎస్టీలు) గిరిజ‌నులు,  5 శాతం ఉన్న‌ మైనార్టీలలో అత్యంత నిరుపేద‌లు ఇంకా చాలామంది పేద‌రికంలోనే మ‌గ్గుతున్నారు. దీనికి కార‌ణం ఆదాయ వ‌న‌రుల పంపిణీ స‌క్ర‌మంగా జ‌రటంలేదు. అంద‌రికీ ఉపాధి అవ‌కాశాలు ల‌భించ‌డంలేదు. ప్ర‌భ‌త్వ ప‌థ‌కాలు, రాజ‌కీయ అవ‌కాశాలు అంద‌ని వెన‌క‌బ‌డేసిన వ‌ర్గాలను గుర్తించి ఆదుకోవ‌డంలో ఈ ప్ర‌భుత్వాలు విఫ‌ల‌మ‌య్యాయనడం లో నూటికి నూరు పాళ్లు నిజం. దీనికి కారణాలు లేకపోలేదు..  కొంద‌రి చేతుల్లోనే నిదులు కేంద్రీకృతం అవ‌డం, ఉన్న‌వారికే కాంట్రాక్ట్ ప‌నులు అప్ప‌జెప్ప‌డం, అధికారంలో ఎవ‌రు ఉన్నా త‌మ అనుయాయుల‌ను బినామీలుగా మ‌ల్చుకొని ల‌క్ష‌ల కోట్లు దారిమ‌ళ్లిచ‌డం ప్ర‌తి ప్ర‌భుత్వంలో వ‌స్తున్న ఆరోప‌ణ‌లు గ‌మనిస్తూనే ఉన్నాం.. అధికారంలో ఉన్నటీఆర్ఎస్ పార్టీలోగాని, ఇటు ప్ర‌తిప‌క్షంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీల‌లోగాని చాలామంది ఉన్న‌త వ‌ర్గాలు, ధ‌నికుల‌ వాళ్లే ఉన్న‌త ప‌ద‌వుల్లో ఉన్నారు. మిగ‌తా చిన్న చిన్న ప‌ద‌వుల్లో, జిల్లా, మండ‌ల క్యాడ‌ర్ ల‌లో బ‌హుజ‌నులు అధికంగా ఉన్న విష‌యం తెలిసిందే. ఏ స‌భ జ‌రిగినా, ఏ పార్టీ మీటింగ్ ఉన్నా మొద‌ట‌గా జెండాలు మోసేది, జై కొట్టేది ద‌ళిత బ‌హుజ‌నల‌న్న వాస్తవం అంద‌రికీ తెలిసిందే. నేటి దళిత బంధు ద్వారా కొందరికి మాత్రమే తాత్కాలిక ఉపశమనం. వాటి ద్వారా వారు వృద్ధి చెందితేనే విజయం సాధించినట్టు! మరి మిగతా బహుజనులు ఏం పాపం చేశారు? ఇవాళ సబ్బండవర్గాలు కోరుకునేది ఇంత వరకు రాజ్యాధికార సాక్షాత్కారం, ఆర్థిక అసమానతలను తొలగించాలని.. కానీ తాత్కాలిక పథకాలతో ఆ వర్గాల ఓటు బ్యాంకు రాజకీయాలు ఇక ఎంతో కాలం సాగవని గుర్తించు కుంటే మంచిదని బహుజన మేధావుల అభిప్రాయం.
Tumblr media
నిజానికి దేశ సంప‌దగాని, కంపెనీలపై హ‌క్కుగాని, య‌జ‌మాని అంటూ ఒక్క‌రే కాదు అంద‌రికీ స‌మాన హ‌క్కు ఉటుంద‌ని, సంప‌ద అంద‌రికీ స‌మానంగా చెందాల‌ని జెర్మ‌నీకి చెందిన ఫిలాస‌ఫ‌ర్, రాజ‌కీయ త‌త్వ‌వేత్త‌, ఆర్థిక నిపుణుడు, జ‌ర్న‌లిస్టు, సామాజిక విప్ల‌వ నాయ‌కుడు కార్ల్ మార్క్స్ తాన దాస్ కాపిట‌ల్ గ్రంథం ద్వారా ఈ ప్ర‌పంచానికి తెలియ‌జేశారు. అలాగే మ‌న భార‌త రాజ్యాంగ నిర్మాత‌, ప్ర‌ముఖ న్యాయవాది, ఆర్థిక శాస్త్ర‌వేత్త‌, రాజ‌కీయ నేత‌, సంఘ‌సంస్క‌ర్త‌, భార‌త‌దేశ తొలి న్యాయ శాఖ‌మంత్రి, భార‌త‌ర‌త్న‌(మ‌ర‌ణానంత‌రం 1990లో అప్ప‌టి ప్ర‌భుత్వం ఇచ్చింది)  డా. బీర్ ఆర్ అంబేడ్క‌ర్ అంద‌రికీ స‌మాన అవ‌కాశాలు క‌ల్పించాల‌ని.. ఒక‌రు చిన్న‌, మ‌రొక‌రు పెద్ద‌, వాడు అంట‌రాని వాడు, వీడు ఉన్న‌త వ‌ర్గంవాడు అన్న భేద‌భావాలు లేకుండా అంద‌ర్నీ స‌మానంగా చూడాల‌న్నారు త‌న ర‌చ‌న‌లు ది బుద్దా అండ్ కార్ల్ మార్క్స్, ది బుద్దా అండ్ హిజ్ ధ‌ర్మ్, ఆయ‌న వివిధ సంద‌ర్భాల‌లో చేసిన ప్ర‌సంగాల‌లో ఈ విష‌యం స్ప‌ష్టంగా పేర్కొన్నారు. మ‌న రాజ్యాంగం కూడా త‌న ప్రియాంబిల్లో ఇలా ఉంటుంది.
Tumblr media
భార‌త దేశాన్ని స‌ర్వ‌స‌త్తాక, సామ్య‌వాద‌, లౌకిక‌, ప్ర‌జాస్వామ్య‌, గ‌ణ‌తంత్ర రాజ్యంగా నిర్మించుకోవ‌డానికి, పౌరులంద‌రికీ సాంఘీక‌, ఆర్థిక‌, రాజ‌కీయ న్యాయాన్ని, ఆలోచ‌న‌, భావ‌ప్ర‌క‌ట‌న‌, విశ్వాసం, ధ‌ర్మం, ఆరాద‌న‌ల స్వాతంత్ర్యాన్ని, అంత‌స్త‌ల్లోనూ, అవ‌కాశాల్లోనూ స‌మాన‌త్వాన్ని చేకూర్చ‌డానికి, వారంద‌రిలో వ్య‌క్తిత్వ గౌర‌వాన్ని, జాతీయ స‌మైక్య‌త‌ను సంర‌క్షిస్తూ, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి, మ‌న రాజ్యాంగ ప‌రిష‌త్ లో 1949 న‌వంబ‌ర్ 26న ఎంపిక చేసుకొని, శాస‌నంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు  మేము స‌మ‌ర్పించుకుంటున్నాము. అని ఉన్న రాజ్యాంగం మ‌న‌ద‌రికీ సుప‌రిచితమే.
Tumblr media
సామ్య‌వాదం అంటే రాజ్యాంగం ప్ర‌కారం ప్ర‌జాస్వామ్య  సామ్య‌వాద‌మని అర్థం. సామ్య‌వాద దేశంలో సంపాద‌న‌ను, సంప‌ద‌ను స‌మానంగా ప్ర‌జ‌ల‌కు పంచాలి. అతికొద్ది మంది చేతుల్లో డ‌బ్బు, ప‌ర‌ప‌తి, సంప‌ద‌, ఉండిపోకూడ‌దు, భూమి, ప‌రిశ్ర‌మ‌లు, వాటి పెట్టుబ‌డుల‌పై ప్ర‌భుత్వం అంటే ప్ర‌జ‌లే నియంత్ర‌ణ చేస్తూ అంద‌రికీ స‌మాన హ‌క్కు ఉండేలా చూడ‌టం నేటి పాల‌కుల క‌ర్త‌వ్యం. కానీ నేడు ఏమి జ‌రుగుతుందో మ‌నందరికీ తెలిసిందే. రాజ్యాంగ ల‌క్ష‌ణాల‌ను, పీఠిక ఉద్ధేశాల‌ను తుంగ‌లో తొక్కి, అస‌లు రాజ్యాంగాన్నే మార్చేయాల‌ని అనే కాడికి నేటి పాల‌కులు వ‌చ్చారంటే వారు ఎంత స్వార్థంగా ఉన్నారో తెలుస్తోంది. నియంతృత్వ ధోర‌ణులు విడనాడి, అంద‌రికీ స‌మాన అవ‌కాశాల‌ను, అందివ్వ‌డమే భార‌త ప్ర‌భుత్వ ల‌క్ష‌ణం.  అంద‌రికీ గౌర‌వంగా జీవ‌నోపాధి, సంపాదించుకునేందుకు అవ‌కాశాలు క‌ల్పించాలి. కానీ ఈ ప్ర‌భుత్వాలు నేడు ఎవ‌రికి అవ‌కాశాలు ఇస్తున్నారో మ‌నంద‌రికీ తెలిసిందే.
Tumblr media
దక్షిణాదిన ప్ర‌ముఖ ద్ర‌విడ ఉద్య‌మ‌కారుడు, స్వీయ గౌర‌వం ఉద్య‌మ‌కారుడు, నాస్తిక‌వాది, హేతువాది పెరియార్ ఈరోడ్ వేంక‌ట రామ‌స్వామి (ఇ. వి. రామ‌స్వామి) ఈయ‌న  పార్ల‌మెంట‌రీ రాజ‌కీయాల మీద విశ్వాసం కోల్పోయి జ‌స్టిస్ పార్టీని ద్రావిడ‌ర్ క‌ళ‌గం అనే సామాజికోద్య‌మ సంస్థ‌గా మార్చారు. ఈ సంస్థ ద్వారా ఈయ‌న అన్ని కులాల వారికి దేవాల‌య ప్ర‌వేశం ఉండాల‌ని పోరాడారు. హిందీ వ్య‌తిరేక ఉద్య‌మంలోనూ విజ‌యం సాధించారు. దీని బ‌ట్టి ఏమి అర్థ‌మ‌వుతుంది.. ఏదీ కూడా బ‌ల‌వంతంగా ప్ర‌జ‌ల‌పై రుద్ద‌కూడ‌దు, ఒక‌రిని శాసించ‌డం, దండించ‌డం త‌గ‌ద‌ని ఈయ‌న ద్వారా నేర్చుకున్నాము. నేటికి ఆయ‌న భావ‌జాలం త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో పెను మార్పులు తీసుకొచ్చింది అన‌డంలో సందేహం లేదు. అయితే ఈయ‌న‌తో విభేదించి అన్నాదురై రాజ‌కీయాల వైపు మొగ్గి ద్ర‌విడ మున్నేట్ర క‌ళ‌గం (డీఎంకే) అనే పేరుతో కొత్త పార్టీ స్తాపించారు. 1969లో అన్నాదురై మ‌ర‌ణం త‌ర్వాత క‌రుణానిధి నాయ‌క‌త్వంలో విభేదించిన ఎమ్ జీ రామ‌చంద్ర‌న్ డీఎంకే నుండి విడిపోయి అఖిత భార‌త అన్నా ద్ర‌విడ మున్నేట్ర క‌ళ‌గం (ఏఐఏడీఎంకే) పేరుతో మ‌రో పార్టీ స్థాపించారు. ఈ రెండు పార్టీలే నేటి వ‌ర‌కు త‌మిళ‌నాడులో రాజ‌కీయాల‌ను శాసిస్తున్నాయి.
Tumblr media
కాబ‌ట్టి ఎవ‌రూ శాశ్వ‌తం కాదు. ప‌ద‌వుల్లో ఉన్నంత సేపు ప్ర‌జ‌లపై ధ్యాస‌, పేద‌రికాన్ని నిర్మూలించ‌డంలో దృష్టి, అంద‌రినీ స‌మానంగా చూడ‌టం, అంద‌రికీ స‌మాన రాజ‌కీయ‌, ఆర్థిక అవ‌కాశాలు కల్పించాల్సిన బాధ్య‌త నేటి పాల‌కుల‌కు ఉంద‌ని తెలుసుకోవాలి. మీ దుర్మార్గాల‌ను ప్ర‌జ‌లు ఎరిగిన‌నాడు(నిజం దాగ‌దు, ధ‌ర్మం నాశ‌నం కాదు) నామ‌రూపాలు లేకుండా పోతారు ఎంత లేసిన మొన‌గాడైన స‌రే అంటున్నారు దళిత రాజ్యాధికార సాధన సమితి సభ్యులు.
-వేంకటేశ్వర్లు బోయ, సీనియర్ జర్నలిస్ట్, జోగులాంబ గద్వాల్
0 notes
gnewstelugu · 3 years
Link
0 notes
yuvataram · 2 years
Text
సీఎం కేసిఆర్ గారి మానస పుత్రిక ఈ దళిత బంధు పథకం...
సీఎం కేసిఆర్ గారి మానస పుత్రిక ఈ దళిత బంధు పథకం…
దళిత బంధు అమలుపై మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో *రాష్ట్ర గిరిజన, స్త్రీ -శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన జిల్లా స్థాయి సన్నాహక సమావేశం ప్రారంభం అయ్యింది. ఈ సమావేశానికి జెడ్పీ చైర్ పర్సన్ కుమారి బిందు, ఎమ్మెల్సీ తక్కెలపళ్లి రవీందర్ రావు, వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ వాసుదేవ రెడ్డి, ఎమ్మెల్యే శంకర్ నాయక్, మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఫరీద్,…
Tumblr media
View On WordPress
0 notes