Tumgik
#భగవద్గీత
mplanetleaf · 2 years
Video
youtube
సృష్టి క్రమము! భగవద్గీత Bhagavad Gita Ch 10:6–10 MPlanetLeaf
2 notes · View notes
bhagavadgitawisdom · 2 years
Text
శ్రీమద్భగవద్గీత - 26 / Bhagavad-Gita - 26
Tumblr media
🌹. శ్రీమద్భగవద్గీత - 26 / Bhagavad-Gita - 26 🌹 ✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ప్రధమ అధ్యాయము - విషాద యోగము - 26 🌴
తత్రాపశ్యత్ స్థితాన్ పార్థ: పిత్రూనథ పితామహాన్ | ఆచర్యాన్మా తులాన్ భ్రాత్రూన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా | శ్వశురాన్ సుహ్రుదశ్చైవ సేనయోరుభయోరపి ||
🌷. తాత్పర్యం : ఇరుపక్షపు సేనల నడుమ నిలిచిన అర్జునుడు అచ్చట తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, పుత్రులను, మనుమలను, స్నేహితులను, మామలను, శ్రేయోభిలాషులను గాంచెను.
🌷. భాష్యము : రణరంగము నందు అర్జునుడు సమస్తబందువులను గాంచెను. తన తండ్రి కాలమునాటి భురిశ్రవుని వంటివారిని, తాతలైన భీష్ముడు మరియు సోమదత్తులను, ద్రోణాచార్యుడు మరియు కృపాచార్యుల వంటి గురువులను, శల్యుడు మరియు శకుని వంటి మేనమామలను, దుర్యోధనుని వంటి సోదరులను, లక్ష్మణుని వంటి పుత్రులను, అశ్వత్థామ వంటి స్నేహితులను, కృతవర్మ వంటి శ్రేయోభిలాషులను అతడు గాంచెను. పలువురు మిత్రులను గూడియున్న సైన్యమును సైతము అతడు చూడగలిగెను. 🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 26 🌹 ✍️ Swamy Bhakthi Vedantha Sri Prapbhupada 📚 Prasad Bharadwaj
🌴 Chapter 1 - Vishada Yoga - 26 🌴
tatrāpaśyat sthitān pārthaḥ pitṝn atha pitāmahān ācāryān mātulān bhrātṝn putrān pautrān sakhīṁs tathā śvaśurān suhṛdaś caiva senayor ubhayor api
🌷 Translation : There Arjuna could see, within the midst of the armies of both parties, his fathers, grandfathers, teachers, maternal uncles, brothers, sons, grandsons, friends, and also his fathers-in-law and well-wishers.
🌷 Purport : On the battlefield Arjuna could see all kinds of relatives. He could see persons like Bhūriśravā, who were his father’s contemporaries, grandfathers Bhīṣma and Somadatta, teachers like Droṇācārya and Kṛpācārya, maternal uncles like Śalya and Śakuni, brothers like Duryodhana, sons like Lakṣmaṇa, friends like Aśvatthāmā, well-wishers like Kṛtavarmā, etc. He could see also the armies which contained many of his friends. 🌹 🌹 🌹 🌹 🌹
0 notes
chaitanyavijnanam · 2 years
Text
🌹. శ్రీమద్భగవద్గీత - 212 / Bhagavad-Gita - 212 🌹 🌴. 5 వ అధ్యాయము - కర్మయోగము - 08 🌴
Tumblr media
🌹. శ్రీమద్భగవద్గీత - 212 / Bhagavad-Gita - 212 🌹 ✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 5 వ అధ్యాయము - కర్మయోగము - 08 🌴
08. నైవ కించిత్ కరోమీతి యక్తో మన్యేత తత్త్వవిత్ | పశ్యన్ శృణ్వన్ స్పృశన్జిఘ్రన్నశ్నన్ గచ్ఛన్స్వపన్ శ్వపన్ ||
🌷. తాత్పర్యం : దివ్యచైతన్య యుక్తుడైన వాడు చూచుట, వినుట, తాకుట, వాసనజూచుట, భుజించుట, కదులుట, నిద్రించుట, శ్వాసించుట వంటివి చేయుచున్నను తాను వాస్తవముగా ఏదియును చేయనట్లుగా ఎరిగియుండును.
🌷. భాష్యము : కృష్ణభక్తిభావనలో నున్నటువంటివాడు శుద్ధస్థితిలో యున్నందున కర్త, కర్మము, స్థితి, ప్రయత్నము, అదృష్టములను ఐదు విధములైన కారణములపై ఆధారపడియుండు ఎటువంటి కర్మలతో సంబంధమును కలిగియుండడు. శ్రీకృష్ణభగవానుని దివ్యమైన భక్తియుక్తసేవలో అతడు నిలిచియుండుటచే అందులకు కారణము.
దేహేంద్రియములతో వర్తించుచున్నను అతడు ఆధ్యాత్మిక కలాపమైన తన వాస్తవస్థితిని గూర్చి సర్వదా ఎరిగియుండును. భౌతికభావనలో ఇంద్రియములు ఇంద్రియభోగమునకై నియోగించబడగా, కృష్ణభక్తిభావన యందు అవి కృష్ణుని ప్రీత్యర్థమై నియోగించబడును. కావుననే కృష్ణభక్తిపరాయణుడు ఇంద్రియకర్మలలో వర్తించుచున్నట్లు తోచినను ఎల్లవేళలా విముక్తుడై యుండును. 🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 212 🌹 ✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada 📚 Prasad Bharadwaj
🌴 Chapter 5 - Karma Yoga - 08 🌴
08. naiva kiñcit karomīti yukto manyeta tattva-vit paśyañ śṛṇvan spṛśañ jighrann aśnan gacchan svapañ śvasan
🌷 Translation : A person in the divine consciousness, although engaged in seeing, hearing, touching, smelling, eating, moving about, sleeping and breathing, always knows within himself that he actually does nothing at all.
🌹 Purport : A person in Kṛṣṇa consciousness is pure in his existence, and consequently he has nothing to do with any work which depends upon five immediate and remote causes: the doer, the work, the situation, the endeavor and fortune. This is because he is engaged in the loving transcendental service of Kṛṣṇa. Although he appears to be acting with his body and senses, he is always conscious of his actual position, which is spiritual engagement.
In material consciousness, the senses are engaged in sense gratification, but in Kṛṣṇa consciousness the senses are engaged in the satisfaction of Kṛṣṇa’s senses. Therefore, the Kṛṣṇa conscious person is always free, even though he appears to be engaged in affairs of the senses. 🌹 🌹 🌹 🌹 🌹
0 notes
nagaraju72 · 1 year
Text
భగవద్గీత 16.23-24
 
వేదవాక్యాలను తిరస్కరించి, కోరికల ప్రేరణను అనుసరించే వ్యక్తి తన పరిపూర్ణతను, ఆనందాన్ని లేదా పరమాత్మ మార్గాన్ని పొందలేడు. కాబట్టి, ఏది సరైనది మరియు ఏది సరైనది కాదు అనే విషయంలో లేఖనాలు మీ అధికారంగా ఉండనివ్వండి.
#Naninanduri
Tumblr media
3 notes · View notes
iskconraichur · 3 days
Video
youtube
భగవద్గీత 4.8 || సాధు, దుష్కృతిన, ధర్మ ||
0 notes
Text
🌹 22, APRIL 2024 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు🌹
🍀🌹 22, APRIL 2024 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు🌹🍀 1) 🌹. శ్రీమద్భగవద్గీత - 523 / Bhagavad-Gita - 523 🌹 🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 34 / Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 34 🌴 2) 🌹. శ్రీ శివ మహా పురాణము - 877 / Sri Siva Maha Purana - 877 🌹 🌻. భద్రకాళీ శంఖచూడుల యుద్ధము - 1 / Kālī fights - 1 🌻 3) 🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 136 / Osho Daily Meditations  - 136 🌹 🍀 136. భయంలోకి వెళ్లడం / 136. GOING INTO FEAR 🍀 4) 🌹 సిద్దేశ్వరయానం - 44🌹 5) 🌹 మీ ఆదర్శాలపై, భగవంతునిపై విశ్వాసం దృఢంగా ఉంచండి. 🌹 6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 542 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 542 - 1🌹 🌻 542. 'పుణ్యకీర్తి' - 1 / 542. 'Punyakeerthi' - 1 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Tumblr media
🌹. శ్రీమద్భగవద్గీత - 523 / Bhagavad-Gita - 523 🌹 ✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 34 🌴
34. యథా ప్రకాశయత్యేక: కృత్స్నం లోకమిమం రవి: | క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత ||
🌷. తాత్పర్యం : ఓ భరతవంశీయుడా! ఒక్కడేయైన సూర్యుడు లోకమునంతటిని ప్రకాశింపజేయునట్లు, దేహంనందలి ఆత్మ సమస్తదేహమును చైతన్యముతో ప్రకాశింప జేయును.
🌷. భాష్యము : చైతన్యము సంబంధించిన సిద్ధాంతములు పెక్కు గలవు. అట్టి చైతన్యమునకు భగవద్గీత యందు ఇచ్చట సూర్యుడు మరియు సూర్యకాంతి యొక్క ఉపమాన మొసగబడినది. సూర్యుడు ఒక్కచోటనే నిలిచియుండి సమస్త విశ్వమును ప్రకాశింప జేయునట్లు, దేహమునందలి హృదయములో నిలిచియున్నట్టి అణుఆత్మ చైతన్యముచే దేహము నంతటిని ప్రకాశింప జేయుచున్నది. కనుక సూర్యకాంతి లేదా వెలుగు సూర్యుని ఉనికిని నిదర్శమైనట్లే, దేహమునందలి చైతన్యము దేహమునందలి ఆత్మ యొక్క ఉనికికి నిదర్శమైయున్నది. ఆత్మ దేహము నందున్నంత కాలము చైతన్యము సైతము వెడలిపోవును.
అనగా ఆత్మలేని దేహము చైతన్యరహితమగును. తెలివిగల ఎవ్వరికైనను ఇది సులభగ్రాహ్యము. కనుకనే చైతన్యమనునది భౌతికపదార్థ సమ్మేళనముచే ఏర్పడినది కాదని, ఆది ఆత్మ యొక్క లక్షణమని తెలియబడు చున్నది. జీవుని ఈ చైతన్యము భగవానుని దివ్యచైతన్యముతో గుణరీతిగనే సమనముగాని దివ్యమైనది కాదు. ఏలయన జీవుని చైతన్యము ఒక దేహమునకే పరిమితమై యుండు అన్యదేహములను గూర్చి తెలియకుండును. కాని సర్వదేహములలో ఆత్మకు స్నేహితునిగా వర్తించుచు నిలిచియుండెడి పరమాత్ముడు మాత్రము సకల దేహముల నెరిగియుండును. ఇదియే దివ్యచైతన్యము మరియు వ్యక్తిగత చైతన్యము నడుమ గల భేదము. 🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 523 🌹 ✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj
🌴 Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 34 🌴
34. yathā prakāśayaty ekaḥ kṛtsnaṁ lokam imaṁ raviḥ kṣetraṁ kṣetrī tathā kṛtsnaṁ prakāśayati bhārata
🌷 Translation : O son of Bharata, as the sun alone illuminates all this universe, so does the living entity, one within the body, illuminate the entire body by consciousness.
🌹 Purport : There are various theories regarding consciousness. Here in Bhagavad-gītā the example of the sun and the sunshine is given. As the sun is situated in one place but is illuminating the whole universe, so a small particle of spirit soul, although situated in the heart of this body, is illuminating the whole body by consciousness. Thus consciousness is the proof of the presence of the soul, as sunshine or light is the proof of the presence of the sun. When the soul is present in the body, there is consciousness all over the body, and as soon as the soul has passed from the body there is no more consciousness.
This can be easily understood by any intelligent man. Therefore consciousness is not a product of the combinations of matter. It is the symptom of the living entity. The consciousness of the living entity, although qualitatively one with the supreme consciousness, is not supreme, because the consciousness of one particular body does not share that of another body. But the Supersoul, which is situated in all bodies as the friend of the individual soul, is conscious of all bodies. That is the difference between supreme consciousness and individual consciousness. 🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Tumblr media
🌹 . శ్రీ శివ మహా పురాణము - 877 / Sri Siva Maha Purana - 877 🌹 ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 38 🌴
🌻. భద్రకాళీ శంఖచూడుల యుద్ధము - 1 🌻
సనత్కుమారుడిట్లు పలికెను- ఆమె యుద్ధ రంగమునకు వెళ్లి సింహనాదమును చేసెను. ఆ దేవియొక్క నాదమును తాళజాలక దానవులు మూర్ఛను పొందిరి (1). ఆమె అమంగళకరమగు అట్టహాసమును పలుమార్లు చేసి మధువును త్రాగి యుద్ధరంగములో నాట్యము చేసెను (2). ఉగ్రదంష్ట్ర, ఉగ్రదండ, కోటవి అను పేర్లుగల దేవీ మూర్తులు కూడ ఇతర దేవీమూర్తులతో గూడి ఆ యుద్ధములో మధువును అధికముగా త్రాగి నాట్యమాడిరి (3). శివగణములలో మరియు దేవతల దళములలో అపుడు పెద్ద కోలాహలము బయలు దేరెను. దేవతలు, గణములు మరియు ఇతరులు అందరు అధికముగా గర్జిస్తూ ఆనందించిరి (4). కాళిని చూచి శంఖచూడుడు వెంటనే యుద్ధమునకు వచ్చెను. భయమును పొందియున్న దానవులకు ఆ రాక్షసరాజు అభయమునిచ్చెను. (5) కాళి ప్రళయకాలాగ్నిని బోలిన అగ్నిని విరజిమ్మెను. కాని ఆ దానవేంద్రుడు దానిని వెంటనే వైష్ణవాస్త్రముతో అవలీల��ా త్రిప్పికొట్టెను (6). అపుడా దేవి వెంటనే అతనిపై నారాయణాస్త్రమును ప్రయోగించెను. ఆ దానవ వీరుని గాంచి ఆ అస్త్రము వర్ధిల్లెను (7).
ప్రళయకాలాగ్ని జ్వాలను బోలియున్న ఆ అగ్నిని గాంచి శంఖచూడుడు దండమువలె నేలపై బడి పలుమార్లు ప్రణమిల్లెను (8). వినీతుడై యున్న దానవుని ంచి ఆ ఆయుధము వెనుదిరిగెను. అపుడా దేవి మంత్రమును పఠించి బ్రహ్మాస్త్రమును ప్రయోగించెను (9). ఆ దానవవీరుడు నిప్పులు గ్రక్కు చున్న దానిని గాంచి నేలపై నిలబడి ప్రణమిల్లి బ్రహ్మాస్త్రముతో దానిని తప్పించెను (10).
సశేషం…. 🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 877 🌹 *✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *
🌴 Rudra-saṃhitā (5): Yuddha-khaṇḍa - CHAPTER 38 🌴
🌻 Kālī fights - 1 🌻
Sanatkumāra said:—
Going to the battle ground, the goddess Kālī roared like a lion. On hearing that the Dānavas fainted.
She laughed boisterously again and again boding ill to the Asuras. She drank the distilled grapewine and danced on the battle ground.
The manifestations of Durgā viz—Ugradaṃṣṭrā (one with fierce fangs) Ugradaṇḍā (one with fierce baton) and Kotavī (the naked) danced on the battle ground and drank wine.
There was great tumult on the side of the Gaṇas and the gods. All the gods and the Gaṇas roared and rejoiced.
On seeing Kālī, Śaṅkhacūḍa hastened to the battle ground. The Dānavas were frightened but the king Śaṅkhacūḍa assured them of protection.
Kālī hurled fire as fierce as the flame of dissolution which the king put out sportively by means of Vaiṣṇava missiles.
Immediately the goddess hurled the Nārāyaṇa missile at him. The missile developed its power on seeing the Dānava Śaṅkhacūḍa.
On realising it as fierce as the flame of fire of dissolution, the Dānava Śaṅkhacūḍa fell flat on the ground and bowed again and again.
On seeing the Dānava humbled the missile turned away. Then the goddess hurled the Brahmā missile with due invocation through the mantra.
On seeing the missile blazing he bowed and fell on the ground. The leader of the Dānavas thus prevented the Brahmā missile from attacking him.
Continues…. 🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Tumblr media
🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 136 / Osho Daily Meditations  - 136 🌹 ✍️. ప్రసాద్ భరద్వాజ
🍀 136. భయంలోకి వెళ్లడం 🍀
🕉  భయం ఉన్నప్పుడల్లా దాని నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించకూడదు. నిజానికి, భయం నుండి సూచనలు తీసుకోండి. అవి మీరు ప్రయాణించాల్సిన దిశలు. భయం కేవలం ఒక సవాలు. ఇది మిమ్మల్ని పిలుస్తుంది: 'రండి!' 🕉
ఏదైనా నిజంగా మంచిగా ఉన్నప్పుడు, అది భయానకంగా కూడా ఉంటుంది, ఎందుకంటే ఇది మీకు కొన్ని అంతర్దృష్టులను తెస్తుంది. ఇది కొన్ని మార్పులకు మిమ్మల్ని బలవంతం చేస్తుంది. ఇది మిమ్మల్ని ఒక అంచుకు తీసుకువెళుతుంది, మీరు వెనక్కి వెళితే, మిమ్మల్ని మీరు ఎప్పటికీ క్షమించరు. మిమ్మల్ని మీరు ఎప్పుడూ పిరికివాడిగానే గుర్తుంచుకుంటారు. ముందుకెళితే ప్రమాదమే. అదే భయంగా ఉంటుంది. కొంత భయం ఉన్నప్పుడల్లా, వెనక్కి వెళ్లకూడదని గుర్తుంచుకోండి, ఎందుకంటే అది పరిష్కరించే మార్గం కాదు. అందులోకి వెళ్ళండి. మీరు చీకటి రాత్రికి భయపడితే, చీకటి రాత్రిలోకి వెళ్లండి-ఎందుకంటే దానిని అధిగమించడానికి అదే మార్గం.
భయాన్ని అధిగమించడానికి అదొక్కటే మార్గం. రాత్రిలోకి వెళ్లండి; అంతకన్నా ముఖ్యమైనది మరొకటి లేదు. వేచి ఉండండి, అక్కడ ఒంటరిగా కూర్చోండి మరియు రాత్రిని పని చేయనివ్వండి. భయపడితే వణకండి. వణుకు ఉండనివ్వండి, కానీ రాత్రికి చెప్పండి, 'నువ్వు ఏమి చేయాలనుకుంటున్నావో అది చేయి. నేను ఇక్కడ ఉన్నాను.' కొన్ని నిమిషాల తర్వాత ప్రతిదీ స్థిరపడిందని మీరు చూస్తారు. చీకటి ఇప్పుడు చీకటి కాదు, అది ప్రకాశవంతంగా మారింది. మీరు దానిని ఆస్వాదిస్తారు. మీరు దానిని తాకవచ్చు- మృదువైన నిశ్శబ్దం, విశాలత, సంగీతం. మీరు దానిని ఆస్వాదించగలరు మరియు మీరు ఇలా అంటారు, 'ఇంత అందమైన అనుభవానికి నేను భయపడ్డాను ఎంత మూర్ఖుడిని!'
కొనసాగుతుంది… 🌹 🌹 🌹 🌹 🌹
🌹 Osho Daily Meditations  - 136 🌹 📚. Prasad Bharadwaj
🍀 136. GOING INTO FEAR 🍀
🕉  Whenever there is fear, never try to escape from it. In fact, take hints from fear. Those are the directions in which you need to travel. Fear is simply a challenge. It calls you: "Come!"  🕉
Whenever something is really good, it is also scary, because it brings you some insights. It forces you toward certain changes. It brings you to a brink from where, if you go back, you will never forgive yourself. You will always remember yourself as a coward. If you go ahead, it is dangerous. That's what is scary. Whenever there is some fear, always remember not to go back, because that is not the way to solve it. Go into it. If you are afraid of the dark night, go into the dark night-because that is the only way to overcome it.
That is the only way to transcend the fear. Go into the night; there is nothing more important than that. Wait, sit there alone, and let the night work. If you fear, tremble. Let the trembling be there, but tell the night, "Do whatever you want to do. I am here." After a few minutes you will see that everything has settled. The darkness is no longer dark, it has come to be luminous. You will enjoy it. You can touch it-the velvety silence, the vastness, the music. You will be able to enjoy it, and you will say, "How foolish I was to be afraid of such a beautiful experience!”
Continues… 🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Tumblr media
🌹 సిద్దేశ్వరయానం - 44 🌹
💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐
🏵 5వ శతాబ్దం నుండి 🏵
హరసిద్ధుడు ఒక పూట ముందు బయలుదేరి ఇంటికి వెళ్ళి పెంపుడు తల్లిదండ్రులతో గడిపి రాత్రి కామాఖ్య కాళీమందిరంలో రాజవసతి స్థలంలో ఉన్నాడు. మొదటి జాము గడచి అర్ధరాత్రి అవుతున్న సమయంలో గదిలో ఏకాంతంగా ఉన్న ప్రశాంతవేళ మధురగానం దూరం నుంచి వినిపిస్తున్నది. నెమ్మదిగా దగ్గరవుతున్నది. ఎవరో తనను పిలుస్తున్నారు.ఆ నాదం మూసిన తలుపులలో నుండి కాంతి తరంగాల రూపంలో లోపలికి వచ్చింది. చూస్తుండగా సుందరమైన ఆకృతి ధరించింది. తనకు అస్త్రవిద్యలు నేర్పిన డాకిని, "మహాయోగినీ! దివ్యవిద్యాధరీ! స్వాగతం" అని లేచి హరసిద్ధుడు ఆహ్వానించాడు. ఆమె “హరా! నిన్ను చూచి సంతోషంగా ఉంది. కార్యార్థివై ఆంధ్రభూమికి వెళుతున్నావు. విజయం సాధించటానికి ప్రయత్నించు" అన్నది. అతడు "దేవీ! నీవు గాన గాంధర్వివి. నా యందు దయ, ప్రేమ కలదానివి. నేను దక్షిణ భారతానికి వెళ్ళి మరొక యుద్ధం, మారణకాండ జరగకుండా శాంతి నెలకొల్పాలని కోరుతున్నాను. నాకు యుద్ధవిద్యలలో ఉన్న నైపుణ్యం మంత్ర విద్యలలో లేదు. నీవు దివ్యాంగనవు. నా కోసం ఈ పని చేసి పెట్టు. నేను పుట్టిన తెలుగు నేలకు ఋణం తీర్చుకొంటాను” అన్నాడు.
డాకిని "వీరాగ్రణీ! నీకు తప్పక చేస్తాను సహాయం. నాకు కూడా నీ వల్ల మేలు జరిగింది. నీకు అస్త్రవిద్యలలో నైపుణ్యం కలిగించినందుకు సంతోషించి భైరవస్వామి నాకు గంధర్వత్వం ప్రసాదించాడు. నేనిప్పుడు భూత భూమికలు దాటి గాంధర్విగా ప్రకాశిస్తున్నాను. నీకు దివ్యశక్తులు వచ్చేలా చేస్తాను. ప్రస్తుతం నీకు స్వప్నమోహినీ విద్యనుపదేశిస్తాను. దానిని ఆంధ్ర నాగనాయకుల మీద ప్రయోగించు. వారి యిష్టదేవతల రూపంలో ఈ స్వప్న దేవత కనపడి యుద్ధం వద్దని శాంతిసంధి చేసుకోమని ఆదేశిస్తుంది. ప్రస్తుతానికి నీ కోరిక నెరవేరుతుంది. మీ మామగారి మనుషులతో అక్కడికి వెళ్ళి ఈ పని సానుకూలమైన తర్వాత వాళ్ళను వెనక్కు పంపించు. అప్పుడు నేను వచ్చి అనంతర కర్తవ్యం చెపుతాను ” అన్నది.
అనుకొన్న విధంగా ఆంధ్రసీమలో శాంతి నెలకొన్నది. గాంధర్వి వచ్చి హరసిద్ధుని కుర్తాళం తీసుకువెళ్ళింది. కుర్తాళనాథేశ్వరుని దర్శనం చేసుకొన్న తర్వాత పొదిగైజలపాతాల దగ్గరకు వెళ్ళారు. అక్కడ ఆమె ఒక సంఘటన తెలియజేసింది. “నీకు వజ్రయాన సాధనలు నేర్పిన బోయాంగ్ కొద్ది కాలం క్రింద ఇద్దరు శిష్యులను, ఒక శునకాన్ని తీసుకొని వచ్చి గురుస్థానమైన కుర్తాళం వచ్చాడు. పొదిగై కొండల మీద దిగి వారితో మృత్యువును జయించగలిగిన ఓషధిఘుటికలను నేను తయారు చేశాను. వాటిని మీకు ఇస్తాను. నేనూ వేసుకొంటాను. నాకెంతో సేవ చేసిన మీకు ఈ మేలు చేస్తున్నాను. అని ఒక మాత్ర కుక్కనోట్లో వేసి, తానొకటి మింగి ఇద్దరు శిష్యులకూ చెరొక మాత్ర యిచ్చాడు. ఒక శిష్యుడు మింగాడు. రెండోవాడు ఇంకా మింగలేదు. ఈ లోపు కుక్క స్పృహతప్పి పడిపోయింది. బోయాంగ్, మొదటి శిష్యుడు కూడా పడిపోయినారు. ఎవరిలోను ప్రాణమున్న లక్షణాలు లేవు. అయ్యో! ఎంత పని జరిగింది! గురువుగారు ఓషధి తయారు చేయటంలో ఏదో పొరపాటు పడినారు. అందరూ మరణించారు. నేను దీనిని మింగను అని ఆ మాత్రను పొదలలోకి విసిరివేసి ఏడుస్తూ క్రిందికి వెళ్ళి ఊళ్ళో వాళ్ళను తీసుకొని మరణించిన వాళ్ళకు అంత్యక్రియలు చేయటం కోసం తిరిగి వచ్చాడు. వచ్చేసరికి అక్కడ ఎవరూ లేరు. ఒక పెద్ద శిల మీద కొన్ని అక్షరాలు వ్రాయబడి ఉన్నవి. "నీవు మాత్ర వేసుకోలేదు. దురదృష్టవంతుడవు. మాకు విద్యున్మయమైన దివ్యదేహాలు వచ్చినవి. ఆకాశమార్గంలో వెళుతున్నాము" అని. రెండవ శిష్యుడు గ్రామస్థులు ఆ మాత్ర కోసం వెదికారు. దొరకలేదు. బాధపడుతూ వెళ్ళారు.
ఆ మాత్ర నీకు దొరుకుతుంది. అది ఇంకా చెడిపోలేదు. పద". ఆమె దివ్యజ్ఞానం వల్ల అది దొరికింది. ఆ మాత్రను అతని చేత మింగించింది. చూస్తూ ఉండగా అతని శరీరంలో అద్భుతమైన పరిణామం వచ్చింది. దాదాపు స్పృహ పోయింది. కాని గంధర్వ డాకిని ప్రక్కన ఉండి జాగ్రత్తలు తీసుకోవటం వల్ల వేగంగానే అతనికి విద్యున్మయమైన శరీరం వచ్చింది. ఆకాశ గమనశక్తి వచ్చింది. "గాంధర్వీ! నీ ఋణం ఎలా తీర్చుకో గలను ? నన్ను సామాన్య మానవుని దివ్యునిగా మార్చావు" అన్నాడతడు. ఆమె "నీ కోసం నేను ఏమైనా చేస్తాను. ఇంకా చేయవలసింది ఉంది. మనం హిమాలయాలలో త్రివిష్టప భూములలోని వజ్రభైరవ గుహదగ్గరకు వెళ్ళాలి. అక్కడ నీవు మరికొన్ని సాధనలు చేయవలసి ఉంది. ఇంతకు ముందు నీవు చూచిన గుహయే అది” అన్నది. అక్కడకు చేరుకొన్న పిదప బహువిధములైన సాధనలు అతనిచేత చేయించింది. అతనికిప్పుడు ఎన్నో దివ్యశక్తులు వచ్చినవి.
"హరసిద్ధా! నీవిప్పుడు పరిపూర్ణ సిద్ధభైరవుడవు. నేను గంధర్వ లోకానికి వెళుతున్నాను. నీవు స్మరించినప్పుడు వస్తాను. నాయంతట నేను కూడా అప్పుడప్పుడు వస్తాను. భవిష్యత్తులో సాధకు లెందరికో నీవు సహాయపడవలసి ఉంది. కలియుగప్రభావం వల్ల మంత్రసిద్ధి ఎంత కష్టపడినారాదు. యోగ్యులను అనుగ్రహించు. భవిష్యత్తులో నేను కూడా మానవ జన్మ తీసుకోవలసి రావచ్చు. అప్పుడు నీవు నాకు సహాయ పడవలసి వస్తుంది. ప్రస్తుతం నీవు నాగభూమి కొకసారి వెళ్ళు. హిరణ్మయి నీ కోసం ఎదురు చూస్తున్నది.
ప్రతి జీవికి ప్రేమ కేంద్రములు మారుతుంటవి. చిన్నప్పుడు తల్లిప్రేమకేంద్రం. శిశువు అమ్మను విడచి ఉండలేదు. పెరుగుతుంటే స్నేహితులు ప్రేమ కేంద్రాలు. తరువాత ప్రియుడు లేక ప్రియురాలు. అనంతరం సంతానం. ఇప్పుడు నీ భార్యకు కుమారుడు ప్రేమ కేంద్రం. అయినా ఆమె నీయందు అనన్యప్రేమ సమన్విత. అప్పుడప్పుడు అక్కడ కొన్నాళ్ళు ఉంటూ దేశసంచారం చేస్తూ దైవ సామ్రాజ్యాన్ని నిర్మించటానికి నిరంతరం కృషి చేస్తూ ఉండు. మరొక్క మాట. కొంతకాలం తర్వాత అమితాభ బుద్ధుని అంశతో పద్మసంభవుడనే యోగిపుట్టి వజ్రవైరోచనిని ఉపాసిస్తాడు. ఆమె సఖిని నేను. అతనిలో కొంతకాలం ఉండు. నీ ప్రవేశం వల్ల అతడు అద్భుతశక్తులు ప్ర��ర్శిస్తాడు. అది పరిమితసమయం మాత్రం. నీవు నీ మార్గంలో ప్రపంచాన్ని ప్రభావితం చెయ్యి, సిద్ధాశ్రమ యోగులతో మైత్రి నీకు మేలు చేస్తుంది. అక్కడ మహనీయులు నీకు మార్గదర్శకులుగా ఉంటారు. భారతదేశంలోనే కాక వివిధ ద్వీపాలలో సిద్ధాశ్రమ కేంద్రాలున్నవి. అక్కడకు వెళ్ళి సిద్ధ సమావేశాలలో పాల్గొనవలసిన అవసరమున్నది. ముఖ్యంగా క్రౌంచద్వీపం భవిష్యత్తులో పెద్ద శక్తికేంద్రం కాబోతున్నది. అక్కడి సిద్ధ కేంద్రాలమీద ప్రత్యేక దృష్టి ఉంచు. నేను ఆత్మీయురాలిగా ఏదో చెపుతున్నాను. అన్నీ నీవింక స్వతంత్రంగా నిర్ణయించగలవు. నిర్వహించగలవు. విజయోస్తు!" ( సశేషం ) 🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🌹 మీ ఆదర్శాలపై, భగవంతునిపై విశ్వాసం దృఢంగా ఉంచండి. / Have faith in your ideals, in God🌹 ✍️. ప్రసాద్‌ భరధ్వాజ
మాట మరియు చేతల ద్వారా ఎవరికీ బాధ కలిగించ వద్దు. మీ కోరికలు, భావోద్వేగాలు మరియు ప్రేరణలను నియంత్రించండి, ముఖ్యంగా కోపం, అసూయ మరియు దురాశ. వారు అహంతో అభివృద్ధి చెందుతారు మరియు దానిని ప్రమాదకరమైన ఆయుధంగా చేస్తారు. మీరు మీ అభిరుచులకు బానిసలుగా ఉన్నప్పుడు, మీరు ఎలా నిలబడి గౌరవాన్ని పొందగలరు? పిరికివాళ్ళు మాత్రమే తమ ఇంద్రియాలకు లేదా కోరికలకు లొంగిపోతారు. ధైర్యవంతులు వాటిని ఎదుర్కొని గెలుస్తారు. యోధుడు తన మనస్సును అధిగమిస్తాడు మరియు దాని ప్రేరణలను అరికడతాడు. వాటిచే అధిగమించ బడిన వాడుగా ఉంటాడు. అది కానివాడు వాటికి లొంగి వాటిచే నడప బడతాడు. అలలు ఎగసి పడినప్పుడు రాయిలాగా నిలుచోండి.
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Tumblr media
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 542 - 1  / Sri Lalitha Chaitanya Vijnanam  - 542 - 1 🌹 🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻 ✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్ సేకరణ : ప్రసాద్ భరద్వాజ 🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁
🍀 111. పుణ్యకీర్తిః, పుణ్యలభ్యా, పుణ్యశ్రవణ కీర్తనా । పులోమజార్చితా, బంధమోచనీ, బంధురాలకా ॥ 111 ॥ 🍀
🌻 542. 'పుణ్యకీర్తి' - 1 🌻
శ్రీమాత పుణ్యకీర్తి కలది అని ఒక అర్థము. ఆరాధించువారికి పుణ్యము నిచ్చుచూ కీర్తి కలిగించునని మరియొక అర్థము. శ్రీమాతను అనునిత్యము ఆరాధన చేయువారు క్రమముగ పుణ్య భావములను పొందుచుందురు. ఆ భావములు ఆచరణ రూపము దాల్చినపుడు లోకహితము కలుగును. చేయు కార్యముల వలన లోక హితము కలుగుచున్నప్పుడు చేయువానికి పుణ్య మబ్బుచుండును. లోకమున కీర్తియు కలుగుచుండును. ఇట్లు పుణ్య సుఖమును కలిగించుట, కీర్తి సుఖమును కలిగించుట శ్రీమాత చేయు కార్యమే. పుణ్యకార్యములు చేయువారు శ్రీమాతకు సమర్పణగ చేయవలెను. అహంకారముతో చేసినచో సుఖ ముండదు. కీర్తియు యుండదు.
సశేషం… 🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 542 - 1 🌹 Contemplation of 1000 Names of Sri Lalitha Devi ✍️ Prasad Bharadwaj
🌻 111. Punyakirtih punyalabhya punyashravana kirtana pulomajarchita bandhamochani bandhuralaka ॥111 ॥ 🌻
🌻 542. 'Punyakeerthi' - 1 🌻
Srimata has Punyakeerti. Another meaning is that she bestows virtue and brings glory to the worshippers. Those who worship Sri Mata daily will gradually attain pious feelings. When those feelings are put into practice, worldly good is done. When the good of the world arises due to one's actions, one attains virtue. There will also be glory in the world. It is the work of Srimata to bring happiness of virtue and happiness of fame. Those who do pious works should surrender to Srimata. If it is done with ego there is no happiness. Nor is there glory.
Continues… 🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Tumblr media
🌹 మీ ఆదర్శాలపై, భగవంతునిపై విశ్వాసం దృఢంగా ఉంచండి. / Have faith in your ideals, in God. 🌹 ✍️. ప్రసాద్‌ భరధ్వాజ
మాట మరియు చేతల ద్వారా ఎవరికీ బాధ కలిగించ వద్దు. మీ కోరికలు, భావోద్వేగాలు మరియు ప్రేరణలను నియంత్రించండి, ముఖ్యంగా కోపం, అసూయ మరియు దురాశ. వారు అహంతో అభివృద్ధి చెందుతారు మరియు దానిని ప్రమాదకరమైన ఆయుధంగా చేస్తారు. మీరు మీ అభిరుచులకు బానిసలుగా ఉన్నప్పుడు, మీరు ఎలా నిలబడి గౌరవాన్ని పొందగలరు? పిరికివాళ్ళు మాత్రమే తమ ఇంద్రియాలకు లేదా కోరికలకు లొంగిపోతారు. ధైర్యవంతులు వాటిని ఎదుర్కొని గెలుస్తారు. యోధుడు తన మనస్సును అధిగమిస్తాడు మరియు దాని ప్రేరణలను అరికడతాడు. వాటిచే అధిగమించ బడిన వాడుగా ఉంటాడు. అది కానివాడు వాటికి లొంగి వాటిచే నడప బడతాడు. అలలు ఎగసి పడినప్పుడు రాయిలాగా నిలుచోండి.
మీ ఆదర్శాలపై, భగవంతునిపై విశ్వాసం దృఢంగా ఉంచండి. వైఫల్యం మీ ద్వారంలోకి వచ్చినప్పుడు విశ్వాసాన్ని క్షీణించ నివ్వవద్దు. దాన్ని కొత్త సవాలుగా ఎదుర్కొని, విజయం సాధించండి. మీ విశ్వాసం మీ శ్వాసలా ఉండకూడదు; ఎందుకంటే ఊపిరి లోపలికి వస్తుంది మరియు బయటకు వెళుతుంది, మరియు ఇటువంటి రావడం, పోవడం, ప్రవేశాలు మరియు నిష్క్రమణల వంటి ప్రత్యామ్నాయాలు లేకుండా మీ విశ్వాసమును దృఢంగానూ, శాశ్వతంగానూ ఉండనివ్వండి. విశ్వాసం అనేది ఒక నిరంతర పూర్ణ ప్రవాహం అయితే, దయ కూడా ఒక నిరంతర పూర్ణ ప్రవాహంలో మీపై కురుస్తుంది. 🌹🌹🌹🌹🌹
🌹 Have faith in your ideals, in God. 🌹
Do not inflict pain on any one, through word and deed. Control your passions, emotions and impulses, especially, anger, envy and greed. They thrive on the ego and make it a dangerous weapon. When you are enslaved by your passions, how can you stand forth and claim respect? Only cowards yield to their senses or passions. Brave men face up to them and win. The hero is he who overrules his mind and curbs his impulses; the zero is he who is overruled by them. Stand fast, like a rock, when the waves beat.
Have faith in your ideals, in God. Do not allow faith to falter when failure comes into your door. Meet it as a new challenge, and triumph. Your Vishwaasam must not be like your Breath; for Breath comes in and goes out, it is now in and now out. Let your vishwaas be firm, with no alternations of entrances and exits. If faith is one full continuous stream, Grace too will be showered on you in one full continuous stream. 🌹🌹🌹🌹🌹
0 notes
kapilagita · 24 days
Text
కపిల గీత - 322 / Kapila Gita - 322
Tumblr media
🌹. కపిల గీత - 322 / Kapila Gita - 322 🌹 🍀. కపిల దేవహూతి సంవాదం 🍀 ✍️. ప్రసాద్‌ భరధ్వాజ 🌴 8. ధూమ - అర్చిరాది మార్గములద్వారా వెళ్ళువారి గతి - భక్తియోగ విశిష్టత - 05 🌴 05. యే స్వధర్మాన్న దుహ్యంతి ధీరాః కామార్థహేతవే| నిస్సంగా న్యస్తకర్మాణః ప్రశాంతాః శుద్ధచేతసః॥
తాత్పర్యము : వివేకవంతులైన గృహస్థులు తమ ఆశ్రమ ధర్మములను సకామ భావముతో ఆచరింపరు. వారు భగవంతుని అనుగ్రహము లభించుట కొరకు మాత్రమే ఆయా ధర్మములను అనుష్ఠింతురు. వారు లౌకిక భోగముల యందు ఆసక్తి లేని వారై వర్ణాశ్రమ ధర్మములను ఆచరించుచు, వాటి ఫలములను భగవంతునికే అర్చించు చుందురు.
వ్యాఖ్య : ఈ రకమైన మనిషికి మొదటి తరగతి ఉదాహరణ అర్జునుడు. అర్జునుడు క్షత్రియుడు, అతని వృత్తి కర్తవ్యం యుద్ధం చేయడం. సాధారణంగా, రాజులు తమ రాజ్యాలను విస్తరించడానికి పోరాడుతారు, వారు ఇంద్రియ తృప్తి కోసం పాలిస్తారు. కానీ అర్జునుడికి సంబంధించినంత వరకు, అతను తన స్వంత ఇంద్రియ తృప్తి కోసం పోరాడటానికి నిరాకరించాడు. భగవద్గీత వినిన తరువాత అతను తన ఇంద్రియ తృప్తి కోసం కాదు, పరమాత్మ యొక్క సంతృప్తి కోసం పోరాడాడు.
ఇంద్రియ తృప్తి కోసం కాకుండా భగవంతుని తృప్తి కోసం తమ నిర్దేశించిన విధులను నిర్వర్తించే వ్యక్తులు భౌతిక స్వభావాల ప్రభావం నుండి విముక్తులైన నిఃసంగ అంటారు. న్యాస్త కర్మః. వారి కార్యకలాపాల ఫలితాలు భగవంతునికి ఇవ్వబడతాయని సూచిస్తుంది. అటువంటి వ్యక్తులు వారి సంబంధిత విధుల వేదికపై పనిచేస్తున్నట్లు కనిపిస్తారు, కానీ అలాంటి కార్యకలాపాలు వ్యక్తిగత ఇంద్రియ సంతృప్తి కోసం నిర్వహించ బడవు; బదులుగా, అవి భగవంతుని కోసం నిర్వహించ బడతాయి. అటువంటి భక్తులను ప్రశాంతః అంటారు, అంటే 'పూర్తిగా సంతృప్తి చెందినవారు.' శుద్ధ-చేతసః అంటే కృష్ణ చేతన; వారి స్పృహ పరిశుద్ధమైంది. శుద్ధి చేయని స్పృహలో తనను తాను విశ్వానికి ప్రభువుగా భావించు కుంటాడు, కానీ శుద్ధి చేయబడిన స్పృహలో తనను తాను భగవంతుని యొక్క శాశ్వతమైన సేవకునిగా భావిస్తాడు. భగవంతుని శాశ్వత సేవకుని స్థానంలో ఉంచుకుని, నిత్యం ఆయన కోసం పని చేస్తే, వాస్తవానికి సంపూర్ణ తృప్తి కలుగుతుంది. ఒక వ్యక్తి తన వ్యక్తిగత ఇంద్రియ తృప్తి కోసం పనిచేసినంత కాలం, అతను ఎల్లప్పుడూ ఆందోళనతో నిండి ఉంటాడు. అది సాధారణ చైతన్యానికి మరియు కృష్ణ చైతన్యానికి మధ్య ఉన్న తేడా.
సశేషం..
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Kapila Gita - 322 🌹 🍀 Conversation of Kapila and Devahuti 🍀 📚 Prasad Bharadwaj 🌴 8. Entanglement in Fruitive Activities - 05 🌴 05. ye sva-dharmān na duhyanti dhīrāḥ kāmārtha-hetave niḥsaṅgā nyasta-karmāṇaḥ praśāntāḥ śuddha-cetasaḥ
MEANING : Those who are intelligent and are of purified consciousness are completely satisfied in Kṛṣṇa consciousness. Freed from the modes of material nature, they do not act for sense gratification; rather, since they are situated in their own occupational duties, they act as one is expected to act.
PURPORT : The first-class example of this type of man is Arjuna. ఆs far as Arjuna is concerned, he declined to fight for his own sense gratification. When he was ordered by Kṛṣṇa and convinced by the teachings of Bhagavad-gītā that his duty was to satisfy Kṛṣṇa, then he fought. Thus he fought not for his sense gratification but for the satisfaction of the Supreme Personality of Godhead.
Persons who work at their prescribed duties, not for sense gratification but for gratification of the Supreme Lord, are called niḥsaṅga, freed from the influence of the modes of material nature. Nyasta-karmāṇaḥ indicates that the results of their activities are given to the Supreme Personality of Godhead. Such persons appear to be acting on the platform of their respective duties, but such activities are not performed for personal sense gratification; rather, they are performed for the Supreme Person. Such devotees are called praśāntāḥ, which means "completely satisfied." Śuddha-cetasaḥ means Kṛṣṇa conscious; their consciousness has become purified.
In unpurified consciousness one thinks of himself as the Lord of the universe, but in purified consciousness one thinks himself the eternal servant of the Supreme Personality of Godhead. Putting oneself in that position of eternal servitorship to the Supreme Lord and working for Him perpetually, one actually becomes completely satisfied. As long as one works for his personal sense gratification, he will always be full of anxiety. That is the difference between ordinary consciousness and Kṛṣṇa consciousness.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
0 notes
gitaacharanintelugu · 2 months
Text
13. సాక్షిగా నిలవడం
మొత్తం భగవద్గీతని ఒక్క పదంలో చెప్పాలంటే 'ద్రష్ట' (సాక్షి) గా చెప్పవచ్చు, ఇది అనేక సందర్భాలలో మనకు కనిపిస్తుంది. మనలో చాలామంది మనమే అన్నీ చేస్తామని, పరిస్థితులను నియంత్రిస్తామని అనుకుంటూ ఉంటాము కనుక నిజాన్ని అర్థం చేసుకోవడం ఎంతో అవసరం.
      కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడికి 60 ఏళ్ల వయసు. అప్పటికే అతడు మంచి జీవితాన్ని గడిపి అన్ని విలాసాలను అనుభవించాడు. ఒక యోధుడిగా అతడు యుద్ధ క్షేత్రంలో అనేకసార్లు విజయాన్ని చవి చూశాడు. యుద్ధ సమయంలో అతడు తానే కర్తనని (అహం కర్త - అహంకారం), తన బంధుమిత్రుల చావుకు తానే బాధ్యుడనని భావించడం వలన యుద్ధ క్షేత్రంలో అతడు విషాదానికి లోనయ్యాడు. అతడు 'కర్త' కాదని, కృష్ణ భగవానుడు అతనితో చెప్పే ప్రయత్నమే భగవద్గీత ! సహజంగా తర్వాతి ప్రశ్న. 'ఒకవేళ నేను కర్తను కాకపోతే మరి ఏమిటి?' భగవానుడు భగవద్గీతలో అర్జునుడితో నీవు 'ద్రష్ట' అంటే సాక్షివని చెబుతారు.
      60 ఏళ్ల జీవితంలోని మంచి, చెడు అనుభవాల వల్ల అర్జునుడు తాను కేవలం ఒక 'సాక్షి' ని మాత్రమే కానీ 'కర్త' ను కాదు అన్న భావనను జీర్ణించుకోలేకపోతాడు. శ్రీకృష్ణ పరమాత్మ శ్రమ కోర్చి చేసిన వివరణ అర్జునుడికి ఈ నిజాన్ని గ్రహింప చేస్తుంది. చాలా సంస్కృతులు మనం కేవలం 'ద్రష్ట' లము మాత్రమేనని చెప్పినా కూడా, ఆధ్యాత్మిక ప్రయాణపు ఆరంభ దశలో ఉన్న వాళ్ళు ఈ భావనను అర్ధం చేసుకోలేక గందరగోళానికి గురవుతారు.
      ద్రష్ట (సాక్షి) అనేది ఒక జ్ఞాన స్థితి; భౌతిక ప్రపంచంలో వ్యక్తీకరించబడేది కాదు. రోజువారీ జీవితంలో మన చుట్టూ జరుగుతున్న సంఘటనలు, పరిణామాల నుండి ఓ అడుగు వెనక్కు వేసి అంతర్గత స్థిరత్వాన్ని కలిగి ఉండే సామర్ధ్యమే ఈ సాక్షి భావం. సుఖదుఃఖాలు అందించే గుణం వస్తువుల్లో ఉన్నప్పటికీ ఎటువంటి నిర్దిష్ట ఫలితాన్ని ఆశించకుండా పని చేయడానికి సిద్ధపడటమే సాక్షిభావం. ఇది మన భావనలను సాక్షిగా గమనించుకుంటూ వాటిని అధీనంలో ఉంచుకునే సామర్ధ్యమే.
0 notes
Text
Tumblr media
ఇన్ని రకాల సాధనలు ఎందుకు!? అనే ప్రశ్న ఓకటి ఉంది! గురువు ఆజ్ఞ మేరకు సాధన చేయడం ప్రారంభం అవుతుంది.. క్రమంగా ఆరోహణ క్రమంలో సాగుతుంది. దశలవారీగా నడుస్తుంది. సాధకుడు తన గత జన్మలో ఓ దశ వరకు ఆధ్యాత్మిక సాధనని పూర్తి చేస్తాడు, మళ్ళీ ఈ జన్మలో ఎక్కడైతే ఆగిందో అదే పాయింట్ నుంచి సాధన ప్రారంభం అవుతుంది. అంటే, అతను గత జన్మలో ఎంత వరకు ఆ సాధనా మార్గంలో అభివృద్ధి చెందాడో అతను ఈ జన్మలో ముందున్న మార్గంలో ప్రయాణం ప్రారంబిస్తాడు. అతను గతంలో చేసిన సాధన మళ్ళీ పునరావృతం చేయాల్సిన అవసరం లేదు. ఈ సూత్రాన్ని భగవద్గీత లో చాలా స్పష్టంగా కృష్ణపరమాత్మ చెప్పారు. ఈ కారణంగానే, సాధన యొక్క అర్హతల మధ్యన వ్యత్యాసాన్ని దృష్టిలో ఉంచుకుని అనేక సాధనలు వివరించడం జరిగింది. ఏ విధమైన సామర్థ్యం ఉన్నవాడు దానికి తగిన విధంగా సాధనను గురువు వివరిస్తారు. దానికి అనుగుణంగా తన ఆధ్యాత్మిక సాధన ఎంపిక చేసుకోవాలి. సాధకుల అర్హతలలో చాలా వైవిధ్యం ఉంటుంది.
ఒక సాధకుడికి ఉపయోగపడే సాధన, అదే సాధన మరో సాధకుడికి హానికరమైన ఫలితం ఇవ్వొచ్చు ‌. లేక అది కాస్త ఇబ్బంది పెట్టవచ్చు. అందుకే మనకు కావాల్సిన విషయం వేరే, నిజంగా మనకు ఏది అవసరం అనే విషయం కూడా వేరే. మనం ఫలానా కావాలి అని కోరుకోవటం వేరే, మన పాత్రత యొక్క అవసరం వేరే. సాధన యొక్క నియమాలు కూడా వ్యక్తి వ్యక్తికీ తేడా ఉంటాయి! పూర్వ కాలంలో మన ఋషులు ఒకే సాధనను వివిధ సాధకులకు వివిధ మార్గాల్లో సూచనలు ఇవ్వడం కనిపిస్తుంది!
#Yoga #Ayurveda #Yagya #Naturopathy
#PatanjaliYogPeeth #Gurukulam
#Patanjaliwellness #DivyaPharmacy
#PatanjaliResearchInstitute
#BharatSwabhimanTrust
#PatanjaliYogSamiti #MahilaPatanjaliYogSamiti
#YuvaBharat #KisanSevaSamiti
#YogPracharakVibhag #SocialMedia
#YCB #AYUSH #IDY #Swadeshi
#LegalCell #TeluguStates #APTGstates
#AndhraPradesh #TelanganaState #SouthIndia #BHARAT
0 notes
paulkattupalli · 9 months
Text
ఆపెన్ హైమర్ సినిమా లో భగవద్గీత, హిందూ మతంను అవమానించారా? 
Tumblr media
View On WordPress
0 notes
mplanetleaf · 3 months
Video
youtube
Renunciation of Liberation భగవద్గీత Chapter 18 Bhagavadgita
0 notes
bhagavadgitawisdom · 2 years
Text
శ్రీమద్భగవద్గీత - 25 / Bhagavad-Gita - 25
Tumblr media
🌹. శ్రీమద్భగవద్గీత - 25 / Bhagavad-Gita - 25 🌹 ✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ప్రధమ అధ్యాయము - విషాద యోగము - 25 🌴
భీష్మద్రోణప్రముఖత: సర్వేషాం చ మహీక్షితామ్ | ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి ||
🌷. తాత్పర్యం : భీష్ముడు, ద్రోణుడు మరియు ఇతర భుపలకుల సమక్షమున శ్రీకృష్ణుడు “ఓ పార్థా! ఇచ్చట కూడియున్నటువంటి కురువంశీయులందరిని గాంచుము” అని పలికెను.
🌷. భాష్యము : సకలజీవుల యందున్న పరమాత్మగా శ్రీకృష్ణుడు అర్జునిని మనస్సులోని ఆలోచనలను అవగతము చేసికొనగలిగెను. ఈ సందర్బమున ఉపయోగింపబడిన హృషీకేశుడు అనెడి పదము ఆ దేవదేవుడు సమస్తము నెరుగునని సూచించుచున్నది. పార్థా (కుంతీ తనయుడు లేదా పృథా తనయుడు) అనెడి పదము సైతము అర్జునిని విషయమున ప్రాధాన్యము కలిగియున్నది. పృథా (తన తండ్రియగు వసుదేవుని సోదరి) తనయుడు కనుకనే తాను సారథి యగుటకు అంగీకరించితినని శ్రీకృష్ణభగవానుడు అర్జునునకు మిత్రునిగా తెలియజేయగోరెను. ఇక “కురువంశీయులను గాంచుము” అని అర్జునునితో శ్రీకృష్ణుడు పలుకుటలో ఉద్దేశ్యమేమి? యుద్ధము అచ్చటనే నిలిపివేయవలెనని అర్జునుడు కోరేనాయేమి? తన మేనత్తకుమారుడైన అర్జునుని నుండి అట్టి విషయమును శ్రీకృష్ణుడు ఎన్నడును ఊహించియుండలేదు. ఈ విధముగా అర్జునుని మనస్సును శ్రీకృష్ణుడు స్నేహపూరిత హాస్యధోరణిలో దర్శించెను. 🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 25 🌹 ✍️ Swamy Bhakthi Vedantha Sri Prapbhupada 📚 Prasad Bharadwaj 🌴 Chapter 1 - Vishada Yoga - 25 🌴
bhīṣma-droṇa-pramukhataḥ sarveṣāṁ ca mahī-kṣitām uvāca pārtha paśyaitān samavetān kurūn iti
🌷 Translation : In the presence of Bhīṣma, Droṇa and all the other chieftains of the world, the Lord said, “Just behold, Pārtha, all the Kurus assembled here.”
🌷 Purport : As the Supersoul of all living entities, Lord Kṛṣṇa could understand what was going on in the mind of Arjuna. The use of the word Hṛṣīkeśa in this connection indicates that He knew everything. And the word Pārtha, meaning “the son of Pṛthā, or Kuntī,” is also similarly significant in reference to Arjuna. As a friend, He wanted to inform Arjuna that because Arjuna was the son of Pṛthā, the sister of His own father Vasudeva, He had agreed to be the charioteer of Arjuna. Now what did Kṛṣṇa mean when He told Arjuna to “behold the Kurus”? Did Arjuna want to stop there and not fight? Kṛṣṇa never expected such things from the son of His aunt Pṛthā. The mind of Arjuna was thus predicted by the Lord in friendly joking. 🌹 🌹 🌹 🌹 🌹
0 notes
chaitanyavijnanam · 2 years
Text
🌹. శ్రీమద్భగవద్గీత - 211 / Bhagavad-Gita - 211 🌹 కర్మయోగము 5-07
Tumblr media
🌹. శ్రీమద్భగవద్గీత - 211 / Bhagavad-Gita - 211 🌹 ✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 5 వ అధ్యాయము - కర్మయోగము - 07 🌴
07. యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేన్ద్రియ: | సర్వభూతాత్మభూతాత్మా కుర్వన్నపి న లిప్యతే ||
🌷. తాత్పర్యం : భక్తియోగముతో కర్మనొనరించువాడును, విశుద్ధాత్ముడును, ఇంద్రియ, మనస్సులను జయించినవాడును అగు మనుజుడు సర్వులకు ప్రియుడై యుండును. సర్వుల యెడ అతడు ప్రియమును కలిగియుండును. అట్టివాడు సదాకర్మల నాచారించుచున్నను ఎన్నడును బద్ధుడు కాడు.
🌷. భాష్యము : కృష్ణభక్తి భావన ద్వారా ముక్తి మార్గమున పయనించువాడు సర్వజీవులకు పరమప్రియుడై యుండును మరియు సర్వజీవులు అతనికి ప్రియులై యుందురు. అతని కృష్ణభక్తి భావనమే అందులకు కారణము. పత్రములు, కొమ్మలు వంటివి వృక్షము నుండి వేరు కానట్లుగా, ఏ జీవియు కృష్ణుని నుండి వేరు కాదని అట్టి భక్తుడు భావించును. వృక్షపు మొదలుకు నీరుపోయుట ద్వారా ఆకులు మరియు కొమ్మలన్నింటికిని నీరు సరఫార యగుననియు లేదా ఉదరమునకు ఆహారము నందించుట ద్వారా దేహమంతయు అప్రయత్నముగా శక్తిని పొందుననియు అతడు ఎరిగియుండును. కృష్ణభక్తిభావన యందు కర్మనొనరించువాడు సర్వులకు దాసుని వలె వర్తించును కావున సర్వులకు ప్రియుడై యుండును.
“అట్టి యెడ అర్జునుడు ఏ విధముగా యుద్దరంగమున ఇతరులకు అపకారము చేసెను? అతడు కృష్ణభక్తిపూర్ణుడు కాడా?” అని ఎవ్వరైనను ప్రశ్నించు అవకాశము కలదు. కాని వాస్తవమునకు ఆత్మ చంపబడని కారణముగా యుద్ధరంగమునందు నిలిచినవారందరును వ్యక్తిగతముగా ఆత్మరూపములో నిలువనున్నందున (ద్విత��యాధ్యాయమున ఇది వరకే తెలుపబడినట్లు) అర్జునుడు చేయు అపకారము కేవలము బాహ్యమునకు మాత్రమే అయియున్నది. అనగా ఆధ్యాత్మికదృష్టిలో కురుక్షేత్రమునందు ఎవ్వరును మరణింపలేదు. స్వయముగా రణరంగమున నిలిచియున్న శ్రీకృష్ణభగవానుని ఆజ్ఞ మేరకు వారు దుస్తులవంటి దేహములు మాత్రమే మార్చబడినవి.
అనగా అర్జునుడు కురుక్షేత్రరణరంగమున యుద్ధము చేసినను కేవలము శ్రీకృష్ణభగవానుని ఆజ్ఞలను సంపూర్ణభక్తిభావనలో నిర్వర్తింపజేసి యున్నందున నిజముగా యుద్ధము చేయనివాడే అయినాడు. అట్టివాడు ఎన్నడును కర్మఫలములచే బద్ధుడు కాడు. 🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 211 🌹 ✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada 📚 Prasad Bharadwaj
🌴 Chapter 5 - Karma Yoga - 07 🌴
07. yoga-yukto viśuddhātmā vijitātmā jitendriyaḥ sarva-bhūtātma-bhūtātmā kurvann api na lipyate
🌷 Translation : One who works in devotion, who is a pure soul, and who controls his mind and senses is dear to everyone, and everyone is dear to him. Though always working, such a man is never entangled.
🌹 Purport : One who is on the path of liberation by Kṛṣṇa consciousness is very dear to every living being, and every living being is dear to him. This is due to his Kṛṣṇa consciousness. Such a person cannot think of any living being as separate from Kṛṣṇa, just as the leaves and branches of a tree are not separate from the tree. He knows very well that by pouring water on the root of the tree, the water will be distributed to all the leaves and branches, or by supplying food to the stomach, the energy is automatically distributed throughout the body.
One may ask, “Why then was Arjuna offensive (in battle) to others? Wasn’t he in Kṛṣṇa consciousness?” Arjuna was only superficially offensive because (as has already been explained in the Second Chapter) all the assembled persons on the battlefield would continue to live individually, as the soul cannot be slain. So, spiritually, no one was killed on the Battlefield of Kurukṣetra. Only their dresses were changed by the order of Kṛṣṇa, who was personally present.
Therefore Arjuna, while fighting on the Battlefield of Kurukṣetra, was not really fighting at all; he was simply carrying out the orders of Kṛṣṇa in full Kṛṣṇa consciousness. Such a person is never entangled in the reactions of work. 🌹 🌹 🌹 🌹 🌹
0 notes
incarnaiton14 · 2 years
Text
*🌹. శ్రీమద్భగవద్గీత - 207 / Bhagavad-Gita - 207 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 5 వ అధ్యాయము - కర్మయోగము - 03 🌴*
*03. జ్ఞేయ: స నిత్యసన్న్యాసీ యో న ద్వేష్టి న కాంక్షతి |*
*నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బన్ధాత్ ప్రముచ్యతే ||*
🌷. తాత్పర్యం :
*కర్మఫలములను ద్వేషించుట గాని, కోరుట గాని చేయనివాడు నిత్యసన్న్యాసిగా తెలియబడును. ఓ మహాబాహుడవైన అర్జునా! ద్వంద్వముల నుండి విడివడి యుండు అట్టివాడు లౌకికబంధములను సులభముగా దాటి సంపూర్ణముగా ముక్తుడు కాగలడు.*
🌷. భాష్యము :
కృష్ణభక్తిరసభావన యందు సంపూర్ణముగా నిమగ్నుడైనవాడు కర్మఫలములను ద్వేషించుట గాని, కోరుట గాని చేయనందున నిత్యసన్న్యాసియై యున్నాడు. శ్రీకృష్ణునితో తనకు గల నిత్యసంబంధమున తన నిజస్థితి ఎరిగియున్న కారణముగా భక్తియుతసేవకు అంకితుడై యుండు అట్టి త్యాగి జ్ఞానమునందు పరిపూర్ణుడై యుండును. శ్రీ కృష్ణుడు పూర్ణుడనియు మరియు తాని అట్టి పూర్ణము యొక్క అంశననియు ఆ భక్తుడు సంపూర్ణముగా నెరిగియుండును. అట్టి జ్ఞానమే వాస్తవమునకు గుణరీతిని మరియు పరిమాణరీతిని సరియై యున్నందున సమగ్రజ్ఞానమై యున్నది.
అంశలు ఏనాడును పూర్ణముతో సమానము కాలేనందున కృష్ణునితో ఏకత్వమనెడి భావనము ఎన్నడును సరియైనది కాదు. జీవుడు భగవానునితో గుణరీతిగనే సమానుడు గాని పరిమాణరీతిని కాదనెడి నిజమైన ఆధ్యాత్మికజ్ఞానము కోరికలు, చింతలు లేనటువంటి పూర్ణాత్మునిగా మనుజుని చేయగలదు. అట్టివాడు ఏది చేసినను కృష్ణుని కొరకే చేయును కనుక అతని మనస్సు నందు ద్వంద్వములు పొడసూపవు. ఆ విధముగా ద్వంద్వాతీతుడై అతడు ఈ భౌతికజగమునందును ముక్తుడై యుండగలడు.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 207 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 5 - Karma Yoga - 03 🌴*
*03. jñeyaḥ sa nitya-sannyāsī yo na dveṣṭi na kāṅkṣati*
*nirdvandvo hi mahā-bāho sukhaṁ bandhāt pramucyate*
🌷 Translation :
*One who neither hates nor desires the fruits of his activities is known to be always renounced. Such a person, free from all dualities, easily overcomes material bondage and is completely liberated, O mighty-armed Arjuna.*
🌹 Purport :
One who is fully in Kṛṣṇa consciousness is always a renouncer because he feels neither hatred nor desire for the results of his actions. Such a renouncer, dedicated to the transcendental loving service of the Lord, is fully qualified in knowledge because he knows his constitutional position in his relationship with Kṛṣṇa. He knows fully well that Kṛṣṇa is the whole and that he is part and parcel of Kṛṣṇa.
Such knowledge is perfect because it is qualitatively and quantitatively correct. The concept of oneness with Kṛṣṇa is incorrect because the part cannot be equal to the whole. Knowledge that one is one in quality yet different in quantity is correct transcendental knowledge leading one to become full in himself, having nothing to aspire to or lament over. There is no duality in his mind because whatever he does, he does for Kṛṣṇa. Being thus freed from the platform of dualities, he is liberated – even in this material world.
🌹 🌹 🌹 🌹 🌹
Tumblr media
#భగవద్గీత #BhagavadGita
#చైతన్యవిజ్ఞానం #PrasadBhardwaj
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
1 note · View note
sakalamnews · 9 months
Link
via Sakalam
0 notes
allindiagovtjobs · 10 months
Text
గరికిపాటి నరసింహారావు జీవిత చరిత్ర
గరికిపాటి నరసింహారావు జీవిత చరిత్ర గరికపాటి నరసింహారావు ప్రముఖ భారతీయ ఆధ్యాత్మిక వక్త, బోధకుడు మరియు టెలివింజెలిస్ట్. ఆయన భారతదేశంలోని ఆంధ్ర ప్రదేశ్‌లోని రావులపాలెం గ్రామంలో గరికపాటి నరసింహారావు  సెప్టెంబర్ 14, 1958న జన్మించారు. గరికపాటి నరసింహారావు వివిధ హిందూ గ్రంధాలపై ప్రత్యేకించి భగవద్గీత, రామాయణం మరియు మహాభారతాలపై తన ప్రసంగాలకు విస్తృతంగా ప్రసిద్ది చెందారు. రావులపాలెంలో తన ప్రాథమిక విద్యను…
Tumblr media
View On WordPress
0 notes