Tumgik
pallibatani · 11 years
Link
     బాలయ్య బాబు ఏ సినిమా చేసినా చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. చాలా చిన్న విషయాల్ని సైతం చాలా సీరియస్ తీసుకుంటాడు. ఎంత కేర్ తీసుకున్నా... దర్శకుల పొరపాట్ల వల్ల కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయనుకోండి. అది వేరే సంగతి. అయితే ఇప్పుడు ఓ సినిమా మాత్రం బాలకృష్ణకు నిద్రపోనివ్వకుండా చేస్తోందట. మ్యాటరేంటంటే... బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ చిత్ర టైటిల్ ను ఇప్పటివరకు ఖరారు చేయలేదు. ఏం టైటిల్ పెట్టాలా అనే ఆలోచనలో బాలయ్యబాబు పడ్డాడట. 
     మొదట ఈ చిత్రానికి రూలర్ అనే టైటిల్ అన్నారు. ఆ తర్వాత జయసింహా అన్నారు. ఇవన్నీ కాదు సామ్రాట్ అయితే సూపర్ గా ఉంటుందని చిత్ర బృందం భావించిందట. అయితే సామ్రాట్ అనే టైటిల్ విని ఫ్యాన్స్ కంగారు పడ్డారట. ఎందుకంటే బాలయ్య గతంలో సామ్రాట్ అశోక్ టైటిల్ తో అట్టర్ ఫ్లాప్ సినిమా ఇచ్చాడు. దీంతో సామ్రాట్ అనే టైటిల్ వద్దురా బాబూ అని ఫ్యాన్స్ గోల పెట్టారు. దీంతో చిత్ర యూనిట్ మళ్లీ వెనక్కి తగ్గింది. సామ్రాట్ పెట్టట్లేదని చెప్పడంతో ఫ్యాన్స్ శాంతించారట. 
     సింహా తర్వాత బోయపాటి, బాలయ్య కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీస్థాయిలో ఉన్నాయి. అందుకే బాలయ్య ఈసినిమాకు పవర్ ఫుల్ టైటిల్ పెట్టాలని అనుకుంటున్నాడు. సో...మరికొద్దిరోజుల్లోనే ఈ చిత్ర టైటిల్ ని అధికారికంగా ప్రకటిస్తారు. 
1 note · View note
pallibatani · 11 years
Link
    సినిమాలు రాజకీయాలు వేరు. అవును వేరని సినిమా వాళ్లే చెబుతుంటారు. కానీ అప్పుడప్పుడు ఆవేశం ఆపుకోలేక ఏవో స్టేట్ మెంట్స్ ఇస్తుంటారు. అంతే రగడ షురూ. ఆ స్టెట్ మెంట్స్ ఏదో ఓ వర్గానికి గట్టిగా తగులుతుంటాయి. సదరు వర్గం డైరెక్ట్ గా సినిమాల మీద పడ్తారు. థియేటర్లలో ఆడనివ్వకుండా నిరసన తెలుపుతుంటారు. అసలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంధ్ర, తెలంగాణ, రాయలసీమ ఉద్యమాలతో అట్టుడుకిపోతోంది. ఈ సమంయంలో ఏం మాట్లాడితే ఏం జరుగుతుందో అని చాలామంది సైలైంట్ గా ఉంటున్నారు.
    కానీ ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి మాత్రం తన మనసులో మాటల్ని డైరెక్ట్ గా చెప్పేస్తున్నాడు. ఎస్.ఎస్.రాజమౌళి లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణకు వీరాభిమాని. అంతేకాదు ఆ పార్టీ నిర్వహించే కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నాడు. ఈ మధ్య జె.పి.కర్నూలులో పర్యటించినప్పుడు సమైక్య వాదులు ఆయనకు అడ్డుతగిలారు. సమైక్య సెగలో ఇరుక్కొని తబ్బిబ్బయ్యారు. అంతే ఈ విషయం మీద రాజమౌళి ట్విట్టర్ లో స్పందించాడు. ఆయన చేసిన ట్వీట్స్ యథాతథంగా...
> JP toured and conducted seminars in telengana when agitations were going on here.He’s doing d same bcos the agitations r now happening there
>  It is sad his tour is being ‘dubbed’ as against the agitations when he’s actually trying to bring people together to discuss the problems.
> He time and again reiterated that the anger and angst if the people is justified. But to find the solution people have to get together, hold
>  Consultations. Hating each other will never solve the problem.And ofcourse bringing ppl together is easier said than done.But one has to try.
అంటూ ట్వీటాడు. అయితే రాజమౌళి కామెంట్స్ పై అటు తెలంగాణ, ఇటు సమైక్యవాదులయితే ఇంకా స్పందించలేదు. కానీ ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం రాజమౌళి అనసవరంగా కెలుక్కుంటున్నారని తెగ కంగారు పడుతున్నారు. రాజమౌళి గారు దయచేసి ఈ ఇష్యూ గురించి మాట్లాడకండి. ప్రభాస్ ప్రస్తుతం సేఫ్ జోన్ లో ఉన్నాడు. రాజకీయాలకు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు మీరు ఇలాంటి కామెంట్స్ చేస్తే బాహుబలి మీద ఎఫెక్ట్ పడే అవకాశముందని సూచిస్తున్నారు. షూటింగ్ కి అంతరాయం కల్పించే ఛాన్స్ ఉందని భయపడుతున్నారు. 
  మరి ప్రభాస్ అభిమానుల మాటల్ని జక్కన్న పట్టించుకుంటాడా లేక తన దూకుడు ఇలాగే కొనసాగిస్తాడా చూడాలి. 
0 notes
pallibatani · 11 years
Link
     అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లిమిటెడ్, రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ సమర్పణలో వీరభద్రం దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ భాయ్. ఈ చిత్రానికి సంబంధించి అన్నపూర్ణ సెవన్ ఎకర్స్ లో వేసిన రాజస్థాన్ సెట్ లో అయ్ బాబోయ్ నీ చూపే చిలకముక్కలా నా మనసుని కరా కరా కొరుకుతున్నావే అంటూ భాస్కరభట్ల రాసిన పాటను రాజు సుందరం నృత్యదర్శకత్వంలో నాగార్జున, రిచా 100 మంది డ్యాన్సర్లపై చిత్రీకరించడం జరిగింది. దీంతో షూటింగ్ మొత్తం పూర్తయింది.
     ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అతి త్వరలో ఆడియో రిలీజ్ చేస్తారు. త్వరలోనే రిలీజ్ డేట్ సైతం ఫిక్స్ చేసి ఎనౌన్స్ చేయనున్నారు. నాగార్జునతో పాటు రిచా, నథాలియా కౌర్, కామ్న జెఠ్మలాని, హంసానందిని, సోను సూద్, ఆశిష్ విద్యార్థి, బ్రహ్మానందం, తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతమందించారు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందించారు. 
0 notes
pallibatani · 11 years
Link
      జూనియర్ ఎన్టీయార్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం రామయ్యా వస్తావయ్యా. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 27న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలతో బడా సినిమాల రిలీజ్ లు వాయిదా పడ్డాయి. దీంతో రామయ్యా వస్తావయ్యా విడుదల కూడా వెనక్కి వెళ్లింది. తాజాగా ఈ చిత్రాన్నిఅక్టోబర్ 10న విడుదల చేయనున్నారట. డిస్ట్రిబ్యూటర్స్ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం అక్టోబర్ 10న రామయ్యా వస్తావయ్యా పక్కాగా విడుదల అవుతుందని అంటున్నారు. అయితే చిత్ర వర్గాలు ఈ విషయాన్ని ధృవీకరించాల్సి ఉంది. 
    ఎన్టీయార్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో సమంతా హీరోయిన్. శృతీహాసన్ కీలక పాత్ర పోషిస్తోంది. గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. తమన్ ఈ చిత్రానికి సంగీతమందిస్తున్నాడు. ఛోటా కె నాయుడు సినిమాటోగ్రఫి. దిల్ రాజు నిర్మిస్తున్నాడు. త్వరలోనే రామయ్యా వస్తావయ్యా పాటల్ని విడుదల చేయనున్నారు. 
0 notes
pallibatani · 11 years
Link
   ఓ సినిమా రిలీజ్ కోసం టాలీవుడ్ ప్రేక్షకులు ఇంత ఆత్రంగా ఎదురుచూడటం ఈ మధ్యకాలంలో బహుషా అత్తారింటికి దారేది చిత్రం కోసమే కావచ్చు. అవును పవర్ స్టార్ పవన కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం అంతటి క్రేజ్ సంపాదించుకుంది. పాటలు విడుదలైన తర్వాత ఆక్రేజ్ మరింత పెరిగింది. అయితే చిత్రం విడుదల తేదీ పలుమార్లు వాయిదా పడుతూ వస్తోంది. నిర్మాతలు సైతం విడుదల తేదీని స్పష్టంగా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఉద్యమాలే దీనికి కారణం.
    అయితే ఎట్టకేలకు ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న విడుదల చేయాలని నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. తాజా సమాచ���రం ప్రకారం గాంధీ జయంతి రోజునే అత్తారింటికి దారేది ప్రేక్షకుల ముందుకు రానుందని ఫిలింనగర్ వర్గాల నుంచి అందుతున్న పక్కా సమాచారం. పవన్ కళ్యాణ్ తో చర్చించిన తర్వాతే అక్టోబర్ 2న రిలీజ్ చేయాలని ఫిక్స్ చేశారట. 
   పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో సమంతా, ప్రణీత హీరోయిన్స్. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించాడు. 
0 notes
pallibatani · 11 years
Link
       చిత్ర పరిశ్రమలో రీల్ ప్రేమలే కాదు.....రియల్ ప్రేమలూ ఉంటాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సరదాగా స్టార్టయ్యే పరిచయాలు ప్రేమ నుంచి పెళ్లి వరకు వెళ్లిన దాఖలాలు కోకొల్లలు. తాజాగా ఓ ప్రేమ జంట పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమౌతున్నారు. అందాల రాక్షసి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన రాహుల్ రవీంద్రన్... ప్రముఖ గాయని చిన్మయి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. వీరిద్దరు గత కొంతకాలంగా డేటింగ్ చేస్తున్నారు. ఈ లవ్ బర్డ్స్ వివాహబంధంతో ఒక్కటవ్వనున్నారు. ఈ విషయాన్ని చిన్మయి తల్లి పద్మాసిని అఫీషియల్ గా అనౌన్స్ చేయడం విశేషం.
     శ్రీపద చిన్మయి ఏం  మాయ చేశావే అనే చిత్రంలో సమంతా పాత్రకు డబ్బింగ్ చెప్పింది. ఈ పాత్రకు అంత మంచి పేరొచ్చిందంటే కారణం చిన్మయి కూడా ఓ కారణం. ఆ తర్వాత వరసగా సమంతాకు పర్మినెంట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మారింది. తెలుగుతో పాటు పలు భాషల్లో సూపర్ హిట్ పాటలు ఆలపించింది. ఇటీవలే చెన్నై ఎక్స్ ప్రెస్ లో పాడిన పాటకు చాలా మంచి పేరొచ్చింది. దీంతో బాలీవుడ్ లోనూ చిన్మయి పేరు మారుమోగింది. 
     రాహుల్, చిన్మయి పెళ్లికి సంబంధించిన పూర్తి వివరాల్ని కుటుంబసభ్యులు త్వరలోనే తెలియజేయనున్నారు. గ్రాండ్ గా పెళ్లి చేసుకోవాలని వీరిద్దరు ప్లాన్ చేసుకుంటున్నారట. 
0 notes